Galla Jayadev: నాన్ బెయిలబుల్ కేసులు పెట్టేంత తప్పు జయదేవ్ ఏం చేశారు?: చంద్రబాబు

  • రైతులకు అన్యాయం జరుగుతుంటే మద్దతుగా నిలవడం తప్పా? 
  • మీలా నమ్మిన ప్రజలను మోసం చేసే చరిత్రహీనులం కాదు
  • ప్రజా జీవితంలో ఉన్నాం
  • ప్రజల కోసం నిలబడతాం 

ఒక ఎంపీ అన్న గౌరవం కూడా లేకుండా గల్లా జయదేవ్ పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు దారుణమంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం కోసం భూమిని త్యాగం చేసిన రైతులకు అన్యాయం జరుగుతుంటే మద్దతుగా నిలవడం తప్పా? అని ప్రశ్నించారు.

'మీలా నమ్మిన ప్రజలను మోసం చేసే చరిత్రహీనులం కాదు. ప్రజా జీవితంలో ఉన్నాం. ప్రజల కోసం నిలబడతాం. నాన్ బెయిలబుల్ కేసులు పెట్టేంత తప్పు జయదేవ్ ఏం చేశారు? ఆయనపై పెట్టిన అక్రమకేసుల్ని పోలీసులు వెనక్కి తీసుకోవాలి. ఎంపీ జయదేవ్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. జయదేవ్ ను వెంటనే విడుదలచేసి ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం' అని చంద్రబాబు ట్వీట్లు చేశారు.

Galla Jayadev
Chandrababu
Andhra Pradesh
Amaravati
  • Error fetching data: Network response was not ok

More Telugu News