Botsa Satyanarayana Satyanarayana: మండలిలో బిల్లు కోసం వైసీపీ అడ్డదారులు: యనమల ఆరోపణలు

  • మా ఎమ్మెల్సీలకు ఫోన్ కాల్స్
  • ఆరోపించిన యనమల
  • దమ్ముంటే నిరూపించాలన్న బొత్స

మూడు రాజధానుల బిల్లును శాసన మండలిలో ఆమోదింపజేసుకోవడం కోసం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అడ్డదారులు తొక్కిందని మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ప్రస్తుత మంత్రి బొత్స సత్యనారాయణ నుంచి తమ పార్టీ ఎమ్మెల్సీలకు ఫోన్లు వచ్చాయని, కొందరు సానుకూలంగా స్పందించారని తమకు తెలిసిందని ఆయన అన్నారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన యనమల, వైసీపీ ఆగడాలను అడ్డుకుని తీరుతామన్నారు.

కాగా, తమ పార్టీ ఎమ్మెల్సీలకు ఫోన్స్ చేశారని యనమల చేసిన వ్యాఖ్యలపై బొత్స మండిపడ్డారు. యనమలకు గానీ, టీడీపీ నాయకులకు గానీ దమ్ముంటే, తాము ఎవరికి ఫోన్ చేశామో నిరూపించాలని ఆయన సవాల్ విసిరారు. యనమల వ్యాఖ్యలను ఆక్షేపించిన ఆయన, తాము ఎవరికీ ఫోన్ చేయలేదని స్పష్టం చేశారు. ఆ అవసరం తమకు లేదని అన్నారు.

Botsa Satyanarayana Satyanarayana
Yanamala
MLC
  • Loading...

More Telugu News