Amaravati: అమరావతిలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నిప్పు... తీవ్ర ఉద్రిక్తత!

  • దొండపాడులో ఘటన
  • నిరసనలకు దిగిన వైసీపీ కార్యకర్తలు
  • అదనపు బలగాలు మోహరించిన పోలీసులు

అమరావతి పరిధిలోని దొండపాడు గ్రామంలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో, ఈ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. నిన్న రాత్రి కొందరు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు తెలుస్తుండగా, విషయం ఈ ఉదయం వెలుగులోకి వచ్చింది.

వెంటనే వైసీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకుని నిరసనలకు దిగారు. విషయం తెలుసుకున్న తుళ్లూరు పోలీసులు, దొండపాడుకు అదనపు బలగాలను తరలించారు. పరిస్థితులు అదుపు తప్పకుండా చర్యలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు. నిందితులను వెంటనే గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు.

Amaravati
YSR
Statue
Dondapadu
Police
  • Error fetching data: Network response was not ok

More Telugu News