varla ramaiah: పార్లమెంట్‌లో హక్కుల తీర్మానం ప్రవేశ పెడతాం: వర్ల రామయ్య

  • గల్లా పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఆయన హక్కులు హరించినట్లే 
  • న్యాయపోరాటం కూడా చేస్తాం
  • దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడతాం

అమరావతి రైతులకు సంఘీభావం తెలపడానికి వెళ్లిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దీనిపై స్పందించిన టీడీపీ నేత వర్ల రామయ్య.. పార్లమెంట్ లో హక్కుల తీర్మానం ప్రవేశ పెడతామని చెప్పారు.

'ఎంపీ జయదేవ్ పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఆయన హక్కులు హరించినట్లే. పార్లమెంట్ లో హక్కుల తీర్మానం ప్రవేశ పెడతాం, దోషులను శిక్షించే వరకు వదలం. న్యాయపోరాటం కూడా చేస్తాం. దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడతాం. రాజ్యాంగ వ్యతిరేక పాలనకు కౌంట్ డౌన్ ప్రారంభం, చివరి వరకు పోరాడతాం' అని వర్ల రామయ్య ట్వీట్ చేశారు.

varla ramaiah
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News