Haircut: దగ్గరుండి హెయిర్‌కట్ చేయించిన తల్లి.. మనస్తాపంతో కుమారుడి ఆత్మహత్య!

  • చెన్నైలోని వలసరవక్కంలో ఘటన
  • హాస్టల్‌లో ఉంటూ 12వ తరగతి చదువుతున్న విద్యార్థి
  • తనకు ఇష్టంలేని కటింగ్ చేయించిందని ఉరివేసుకుని ఆత్మహత్య

తల్లి తనకు ఇష్టంలేని కటింగ్ చేయించిందన్న మనస్తాపంతో 12వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. చెన్నైలోని వలసరవక్కం ప్రాంతంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. శీనివాసన్ (17) కుంద్రత్తూరులోని ప్రభుత్వ వసతి గృహంలో ఉంటూ 12వ తరగతి చదువుతున్నాడు. ఇటీవల హాస్టల్‌కు పొంగల్ సెలవులు ఇవ్వడంతో ఇంటికి వచ్చాడు. కుమారుడి హెయిర్‌స్టైల్ చూసిన తల్లి మోహన.. కోప్పడింది. చదువుకుంటున్న కుర్రాడికి ఇలాంటి ఫ్యాషన్ కటింగ్‌‌లు ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేసింది.

సెలూని కు వెళ్లి చక్కగా కటింగ్ చేయించుకోమని చెప్పింది. అయితే, అతడు ఒక్కడే వెళ్తే మళ్లీ అలాగే చేయించుకుంటాడని భావించిన మోహన.. కుమారుడిని తీసుకుని సెలూన్‌కు వెళ్లింది. దగ్గరుండి కటింగ్ చేయించింది. ఆదివారం ఉదయం కుమారుడిని ఇంటి దగ్గరే వదిలేసి ఆమె తన పనులకు వెళ్లిపోయింది.

 సాయంత్రం ఇంటికొచ్చి చూసిన తల్లి నిర్ఘాంతపోయింది. ఇంట్లోని ఫ్యాన్‌కు శీనివాసన్ చీరతో ఉరివేసుకుని కనిపించాడు. కుమారుడిని విగతజీవిగా చూసిన మోహన రోదిస్తూ కుప్పకూలిపోయింది. ఆమె రోదనలు విన్న ఇరుగుపొరుగు వారు వచ్చి చూడడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Haircut
Chennai
mother
Suicide
  • Loading...

More Telugu News