AP Assembly Session: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుకు శాసనసభ ఆమోదం

  • బిల్లుపై సుదీర్ఘ చర్చ
  • జగన్ ప్రసంగం తర్వాత ఆమోదిస్తున్నట్టు తెలిపిన స్పీకర్
  • సభ నేటికి వాయిదా

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. శాసనసభలో నిన్న ఈ బిల్లుపై సుదీర్ఘ చర్చ జరిగింది. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడారు. వికేంద్రకరణ బిల్లుకు మెజారిటీ ఎమ్మెల్యేలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో బిల్లును ఆమోదిస్తున్నట్టు రాత్రి పది గంటలు దాటిన తర్వాత స్పీకర్ తమ్మినేని ప్రకటించారు. వికేంద్రీకరణ బిల్లు ప్రకారం.. కర్నూలులో హైకోర్టు, అమరావతిలో శాసనసభ, విశాఖపట్టణంలో సచివాలయం, రాజ్‌భవన్, హెచ్‌వోడీలను ఏర్పాటు చేస్తారు. శాసనసభలో బిల్లును ఆమోదించిన అనంతరం స్పీకర్ సభను నేటికి వాయిదా వేశారు.

AP Assembly Session
three capitals
Andhra Pradesh
  • Loading...

More Telugu News