Andhra Pradesh: పరామర్శించే హక్కు మాకుంది, ఎవరు ఆపుతారో రండి: నాగబాబు

  • రాజధాని గ్రామాల్లో పర్యటించాలనుకుంటున్న జనసేన నేతలు
  • భారీగా మోహరించిన పోలీసులు
  • రాజధానిపై జనసేనకు స్థిరమైన వైఖరి ఉందన్న నాగబాబు

ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితుల్లో జనసేన పార్టీ రాజధాని ప్రజల పక్షాన నిలవాలని నిశ్చయించుకుంది. ఈ క్రమంలో అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన అమరావతి గ్రామాల రైతులను, మహిళలను పరామర్శించేందుకు జనసేన అగ్రనాయకత్వం సిద్ధం కాగా, పోలీసులు భారీగా మోహరించి వారి ప్రయత్నాలను నిలువరించారు.

 దీనిపై మెగాబ్రదర్ నాగబాబు మీడియాతో మాట్లాడుతూ, ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిలో ఎర్రబాలెం వరకు వెళ్లి తీరుతామని, ఎవరొచ్చి అడ్డుకుంటారో చూస్తామని సవాల్ విసిరారు. రైతులకు సానుభూతి తెలిపే హక్కు తమకుందని, తమను పోలీసులు అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. రాజధాని అంశంలో జనసేన పార్టీ దృఢవైఖరితో ఉందని, పార్టీ నిర్ణయాన్ని తాము పాటిస్తామని చెప్పారు. ప్రస్తుతం జనసేన కార్యాలయం వద్ద పోలీసులు పవన్ కల్యాణ్ కు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తుండగా, పవన్ మాత్రం రాజధానిలో పర్యటించి తీరాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Andhra Pradesh
Amaravati
AP Capital
Janasena
Pawan Kalyan
Nagababu
Police
  • Loading...

More Telugu News