Telangana: ఎన్నికల్లో పంచే డబ్బులు మనవే!: తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్

  • కరీంనగర్ జిల్లాలో రోడ్ షో
  • ఎవరైనా డబ్బులు ఇస్తే తీసుకోండని సూచన
  • ఓటు మాత్రం టీఆర్ఎస్ కే వేయాలన్న గంగుల

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భూదందాలతో డబ్బులు దండుకున్న వారు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ రోజు కరీంనగర్ జిల్లాలోని పలు డివిజన్లలో ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరైనా డబ్బులు ఇస్తే తీసుకుని టీఆర్ఎస్ కే ఓటేయాలని సూచించారు.

ఎన్నికల్లో పంచే డబ్బులు మనవే అని చెప్పారు. డబ్బులను కాదనకుండా తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. పోటీచేస్తున్న నాయకులను పిలిచి.. ఓటుకు రెండు వేలు అడిగి తీసుకోవాలని ఓటర్లను గంగుల కోరారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని చెప్పారు.

Telangana
TRS
TS Municipal Elections
Minister
Gangula Kamalaker
Karimnagar
  • Loading...

More Telugu News