Andhra Pradesh: జగన్ ఒక చేతగాని దద్దమ్మ అని ఒప్పుకున్నందుకు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు: లోకేశ్

  • అధికార, విపక్షాల మధ్య మాటలయుద్ధం
  • వైసీపీ నేతలపై లోకేశ్ ధ్వజం
  • విశాఖ భూ అక్రమాలపై విచారణకు సిద్ధమా? అంటూ జగన్ కు సవాల్

ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తమపై అధికార పక్షం చేస్తున్న ఆరోపణలకు టీడీపీ నేతలు దీటుగా బదులిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి నారా లోకేశ్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఒక చేతగాని దద్దమ్మ అని వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఒప్పుకున్నారని, అందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని ట్వీట్ చేశారు.

గత ఎనిమిది నెలల నుంచి ఏమీ పీకలేని వాళ్లు ఇప్పుడు ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ గాలి పోగేసి పాత పాటే పాడుతున్నారని విమర్శించారు. రాజధానికి సంబంధం లేని భూములు కూడా ఇన్ సైడర్ ట్రేడింగ్ కింద విచారణ చేస్తామంటున్నారని, తాము ఆ విచారణకు సిద్ధమేనని లోకేశ్ స్పష్టం చేశారు. మరి గత ఎనిమిది నెలల్లో విశాఖలో జరిగిన భూ అక్రమాలపై విచారణకు జగన్ సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు.

Andhra Pradesh
Amaravati
Insider Trading
Nara Lokesh
Telugudesam
YSRCP
Jagan
  • Loading...

More Telugu News