JP Nadda: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఏకగ్రీవం

  • ముగిసిన బీజేపీ సంస్థాగత ఎన్నికలు
  • నడ్డాకు బాధ్యతలు అప్పగించిన అమిత్ షా
  • ఇప్పటివరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా వ్యవహరించిన నడ్డా

సుదీర్ఘ చరిత్ర కలిగిన జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కొత్త అధ్యక్షుడిగా జగత్ ప్రకాశ్ నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జేపీ నడ్డా ఎన్నిక లాంఛనమేనని తెలిసినా, పార్టీ రాజ్యాంగం ప్రకారం ఎన్నికల ప్రక్రియ నిర్వహించి నామినేషన్ల స్వీకరణ జరిపారు. ఈ మధ్యాహ్నంతో నామినేషన్ల ఉపసంహరణ, పరిశీలన గడువు ముగియడంతో, నడ్డా జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైనట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయనకు పార్టీ పగ్గాలు అందించారు. ఇప్పటివరకు నడ్డా బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా వ్యవహరించారు.

JP Nadda
BJP
Amit Shah
President
Narendra Modi
India
  • Loading...

More Telugu News