KCR: కేసీఆర్ ను నాడు మోదీ ఆకాశానికెత్తేసిన వీడియోను పోస్టు చేసిన టీఆర్ఎస్ ఎంపీ

  • మిషన్ భగీరథపై మోదీ ప్రశంసలు
  • కేసీఆర్ ఆలోచన గొప్పది అంటూ పొగడ్తలు
  • మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పాత వీడియోను తెరపైకి తెచ్చిన సంతోష్ 

తెలంగాణ సీఎం కేసీఆర్ గొప్పతనాన్ని చాటడానికి టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఓ పాత వీడియోను తెరపైకి తెచ్చారు. ప్రస్తుతం తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హడావుడి నెలకొని ఉండడంతో, బీజేపీని ఆత్మరక్షణ ధోరణిలో పడేసేందుకు సంతోష్ కుమార్ ప్రధాని మోదీ మాట్లాడిన ఓ వీడియోను ట్వీట్ చేశారు. ఆ వీడియోలో మోదీ సీఎం కేసీఆర్ ను అపర భగీరథుడి కంటే ఎక్కువ అనేంతగా పొగడ్తల వర్షంలో ముంచెత్తడం చూడొచ్చు.

తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన మిషన్ భగీరథ పథకంపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. ఆ పథకాన్ని తీసుకువచ్చిన కేసీఆర్ ఆలోచన ఎంతో గొప్పది అంటూ కీర్తించారు. అప్పట్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య పెద్దగా విభేదాలు లేని రోజుల్లో మోదీ పొగడ్తలు పెద్దగా ఆశ్చర్యం కలిగించకపోవచ్చు. అయితే, ఇప్పుడా పాత వీడియో సాయంతో మోదీ సైతం కేసీఆర్ గొప్పతనాన్ని అంగీకరించాడని చెప్పడం ద్వారా ఓటర్లను ఆకట్టుకునేందుకు సంతోష్ కుమార్ ప్రయత్నిస్తున్నట్టు అర్థమవుతోంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News