Arun Adith: శివాత్మిక తాజా చిత్రం మొదలైంది

  • 'దొరసాని'గా పరిచయమైన శివాత్మిక 
  •  తదుపరి చిత్రంగా 'విధి విలాసం'
  • కీలకమైన పాత్రలో ఇంద్రజ   

జీవిత - రాజశేఖర్ చిన్నకూతురు శివాత్మిక 'దొరసాని' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. దొర కుమార్తె దేవకిగా ఆమె ప్రేక్షకులను మెప్పించింది. ఆమె తదుపరి చిత్రం 'విధి విలాసం' టైటిల్ తో కొంతసేపటి క్రితం పూజా కార్యక్రమాలను జరుపుకుంది. హైదరాబాద్ - ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో ఈ సినిమాను లాంచ్ చేశారు.

హీరో అరుణ్ అదిత్ .. హీరోయిన్ శివాత్మికలపై దర్శకుడు ప్రవీణ్ సత్తారు క్లాప్ ఇవ్వగా, హరీశ్ శంకర్ కెమెరా స్విచ్చాన్ చేశాడు. ముహూర్తపు సన్నివేశానికి దశరథ్ గౌరవ దర్శకత్వం వహించాడు. ఎస్ కేఎస్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకి, దుర్గా నరేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఇంద్రజ కీలకమైన పాత్రను పోషిస్తుంది. ఇతర ముఖ్య పాత్రల్లో కోట .. పోసాని .. జయ ప్రకాశ్ రెడ్డి .. అజయ్ .. సత్య కనిపించనున్నారు.

Arun Adith
Sivathmika
Indraja
  • Loading...

More Telugu News