Amaravati: ప్యాకేజీ నచ్చని రైతులకు భూములను వెనక్కి ఇచ్చేస్తాం: శాసనసభలో మంత్రి బుగ్గన

  • ఏపీకి మూడు రాజధానులు ఉంటాయి
  • పొలాలకు నీరు కావాలని మాత్రమే రైతులు కోరుకుంటున్నారు
  • అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ ను ఏర్పాటు చేస్తాం

ఏపీకి మూడు రాజధానులుంటాయని అసెంబ్లీలో మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ గా ఉంటుందని, విశాఖలో రాజ్ భవన్, సచివాలయం ఉంటాయని, కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రాజమహల్ లు కావాలని రైతులు అడగడం లేదని... పొలాలకు నీరు కావాలని మాత్రమే కోరుకుంటున్నారని చెప్పారు. మంచి పరిపాలన కావాలని ఆశిస్తున్నారని తెలిపారు. అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ ను ఏర్పాటు చేస్తామని... శాసన రాజధానిగా అమరావతి కొనసాగుతుందని బుగ్గన చెప్పారు. అమరావతి మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ ప్యాకేజీ నచ్చని రైతులకు భూములు వెనక్కు ఇచ్చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు.

Amaravati
AP Assembly Session
Buggana Rajendranath
YSRCP
  • Loading...

More Telugu News