Andhra Pradesh: పోలీసులను ఛేదించుకుని అసెంబ్లీ మెయిన్ గేట్ వద్దకు చేరుకున్న అమరావతి రైతులు

  • సచివాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత
  • నలువైపుల నుంచి సచివాలయాన్ని ముట్టడించేందుకు రైతుల యత్నం
  • జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు

అమరావతిలోని సచివాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులను ఛేదించుకుని రైతులు సచివాలయం మెయిన్ గేట్ వద్దకు చేరుకున్నారు. నలువైపుల నుంచి సచివాలయాన్ని ముట్టడించేందుకు యత్నిస్తున్నారు. జాతీయ జెండాలను చేతబట్టి ముందుకు వస్తున్న రైతులు, మహిళలను పోలీసులు అడ్డుకుంటున్నారు. సేవ్ అమరావతి అంటూ వారు నినదిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అంతేకాదు సచివాలయం పక్కనే ఉన్న చెరువులోకి దిగి నినాదాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Andhra Pradesh
AP Secretariat
Amaravati
Farmers
  • Loading...

More Telugu News