Avanthi Srinivas: అన్ని ప్రాంతాలను ముఖ్యమంత్రి జగన్ అభివృద్ధి చేయనున్నారు: అవంతి శ్రీనివాస్‌

  • రాష్ట్రంలోని 13 జిల్లాలు మాకు చాలా ముఖ్యం
  • అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలనుకుంటున్నాం
  • రాజకీయ  ప్రయోజనాల కోసమే చంద్రబాబు నిరసనలు తెలుపుతున్నారు 

ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి వికేంద్రీకరణ చాలా ముఖ్యమని ఏపీ పర్యాటక శాఖ మంత్రి  అవంతి శ్రీనివాస్‌ అన్నారు. ఈ రోజు ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 'రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను ముఖ్యమంత్రి జగన్ అభివృద్ధి చేయనున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలు మాకు చాలా ముఖ్యం. అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలనుకుంటున్నాం. రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసమే చంద్రబాబు నాయుడు నిరసనలు తెలుపుతున్నారు' అని అన్నారు.

ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ... 'బోస్టన్ కమిటీ, జీఎన్ రావు కమిటీ చేసిన ప్రతిపాదనల పట్ల నేను సానుకూలంగా ఉన్నాను. కమిటీల ప్రతిపాదనలు ఆమోదం పొందుతాయా? లేదా? అన్న విషయాన్ని తెలుసుకోవడానికి ఐదు కోట్ల మంది ఆంధ్రప్రజలు ఎదురుచూస్తున్నారు'   అని తెలిపారు.

Avanthi Srinivas
Andhra Pradesh
Amaravati
  • Loading...

More Telugu News