Andhra Pradesh: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే!
- పరిపాలన వికేంద్రీకరణకు ఆమోదం
- సీఆర్డీఏ ఉపసంహరణ
- మున్సిపల్ కార్పొరేషన్ గా అమరావతి ప్రాంతం
ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన కొనసాగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశం సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు ఇవే. హైపవర్ కమిటీ నివేదికకు ఆమోదముద్ర.
- పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణకు ఆమోదం.
- రాజధాని రైతులకు మెరుగైన ప్యాకేజీ ఇచ్చేందుకు నిర్ణయం.
- రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు కౌలు 10 ఏళ్ల నుంచి 15 ఏళ్లకు పెంపు.
- సీఆర్డీఏ ఉపసంహరణకు ఆమోదం.
- 11 వేలకు పైగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం.
- అమరావతి ప్రాంతాన్ని మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పాటు చేయాలని నిర్ణయం.
- విశాఖకు సచివాలయం, హెచ్ఓడీ కార్యాలయాల తరలింపు
- అమరావతిలోనే అసెంబ్లీ మూడు సెషన్లు
- కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు ఆమోదం