Amaravati: మందడంలో నల్ల జెండాలతో...వెలగపూడిలో నల్ల బెలూన్లతో నిరసన

  • అమరావతి కోసం రైతుల శాంతియుత ఆందోళన
  • పోలీసుల ఆంక్షలపై మండిపాటు
  • 'సేవ్‌ అమరావతి, సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌' అని నినాదాలు

పోలీసుల ఆంక్షలు, గృహనిర్బంధాలతోపాటు తమ గళం వినిపించేందుకు అవకాశం ఇవ్వడం లేదని ఆగ్రహిస్తున్న అమరావతి రైతులు ఈరోజు తమ నిరసనను మరో రూపంలో తెలియజేశారు. అమరావతి జేఏసీ అసెంబ్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో పోలీసులు రాజధాని గ్రామాల్లో మోహరించిన విషయం తెలిసిందే.

డ్రోన్ల సాయంతో గ్రామాలపై నిఘా ఉంచి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దీన్ని నిరసిస్తూ మందడం, వెలగపూడి రైతులు నల్ల జెండాలు, నల్ల బెలూన్లతో నిరసన తెలియజేశారు. మందడం రైతులు తమ ఇళ్లపై నల జెండాలు ఎగురవేయడమేకాక, రోడ్డుపైకి వచ్చి నల్ల జెండాలతో నిరసన తెలిపారు. వెలగపూడి రైతులు నల్ల బెలూన్లను గాలిలోకి వదిలారు. ‘సేవ్‌ అమరావతి, సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌’ అని నినాదాలు చేయడమేకాక, నినాదాలు రాసిన బోర్డులను గోడకు వేలాడదీశారు.

Amaravati
Mandadam
velagapudi
farmers
  • Loading...

More Telugu News