Amaravati: కీలక నేతల హౌస్‌ అరెస్టు...తాజాగా సీపీఐ రామకృష్ణ, బుద్ధా వెంకన్న!

  • ఎక్కడి నేతలు అక్కడే నిర్బంధం
  • ఎక్కడికక్కడ ఆంక్షలు
  • గుంటూరులో విద్యార్థి జేఏసీ నల్ల బెలూన్లతో నిరసన

అమరావతి జేఏసీ అసెంబ్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో ఈరోజు ఉదయం 11 గంటల నుంచి జరగనున్న సమావేశాలకు ఎటువంటి ఆటంకం తలెత్తకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కీలక నేతల గృహనిర్బంధం కొనసాగిస్తున్నారు.

ఈ క్రమంలో అమరావతి జేఏసీ పోరాటంలో కీలకంగా వ్యవహరిస్తున్న సీపీఐ రామకృష్ణ, టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను ఈ రోజు పోలీసులు ఇంటికే పరిమితం చేశారు. ఇతర ప్రాంతాల్లోనూ నిన్నటి నుంచే పోలీసులు ఆంక్షలు కొనసాగిస్తున్నారు. అసెంబ్లీ, సచివాలయానికి వెళ్లే దారుల్లో డేగ కళ్లతో నిఘా ఉంచారు. ప్రకాశం బ్యారేజీ వద్ద వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించాకే అనుమతిస్తున్నారు. మరోవైపు గుంటూరులో విద్యార్థి జేఏసీ సభ్యులు నల్ల బెలూన్లతో నిరసన తెలిపారు. బెలూన్లను గాలిలోకి వదిలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Amaravati
house arrests
cpi ramakrishna
budda venkanna
  • Loading...

More Telugu News