trivikram Srinivas: వైజాగ్ అమ్మాయిల అందంపై త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • ఆంధ్రా యూనివర్శిటీ ఇక్కడే ఉంది
  • విశాఖ సముద్ర తీరం నాకెంతో ఇష్టం
  • 'అల వైకుంఠపురములో..' సక్సెస్ మీట్ లో త్రివిక్రమ్

విశాఖపట్నం పేరు చెప్పగానే, తనకు ఇక్కడ ఉండే ఆంధ్రా యూనివర్శిటీతో పాటు, అందమైన అమ్మాయిలు గుర్తుకు వస్తారని ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. నిన్న రాత్రి విశాఖ వేదికగా 'అల వైకుంఠపురములో..' సక్సెస్ మీట్ జరుగగా, త్రివిక్రమ్ ప్రసంగించారు. ఇక్కడి అమ్మాయిలు చాలా అందంగా ఉంటారని త్రివిక్రమ్ వ్యాఖ్యానించగానే, బన్నీ అభిమానులు, కార్యక్రమానికి వచ్చిన ప్రజలు కేరింతలు కొట్టారు. ఇక్కడి బీచ్ తనకు ఎంతో ఇష్టమని, ఇక్కడే శ్రీశ్రీ తన మహాప్రస్థానం ప్రతులను పట్టుకుని రోడ్లపై తిరిగారని అన్నారు.

చలం, రావిశాస్త్రి, సీతారామశాస్త్రి వంటి ఎందరో మహానుభావులను అందించిన వైజాగ్, ఎన్నో ఒంపులున్న మహానగరమని, ఈ నగరానికి తాను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని కవితాత్మకంగా వైజాగ్ విశిష్టతను తెలిపారు. తాను ఇక్కడే చదువుకున్నానని, ఆనాటి జ్ఞాపకాలు తన మనసులో పదిలంగా ఉన్నాయని, తన భవిష్యత్తుకి బాటలు వేసిన విశాఖకు రుణపడివుంటానని త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలిపారు.

trivikram Srinivas
Andhra Pradesh
Vizag
Ala Vaikunthapuramulo
  • Loading...

More Telugu News