Chattisgarh: హాస్టల్లో మృతశిశువుకు జన్మనిచ్చిన విద్యార్థిని

  • చత్తీస్ గఢ్ లో ఘటన
  • కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న అమ్మాయి
  • తన గ్రామానికే చెందిన యువకుడితో శారీరక సంబంధం

చత్తీస్ గఢ్ లోని దంతెవాడ జిల్లాలో ఆశ్చర్యం కలిగించే ఘటన చోటుచేసుకుంది. చదువుకుంటున్న ఓ అమ్మాయి హాస్టల్లో బిడ్డకు జన్మనిచ్చింది. పతారాస్ గ్రామానికి చెందిన బాలిక ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. కొన్నాళ్లుగా తన గ్రామానికే చెందిన యువకుడితో ప్రేమలో ఉంది. వారి ప్రేమ శారీరక సంబంధం వరకు వెళ్లడంతో అమ్మాయి గర్భం దాల్చింది. ఈ నేపథ్యంలో తాను ఉంటున్న హాస్టల్ లోనే మృతశిశువుకు జన్మనిచ్చింది.

ఈ ఘటనను దంతెవాడ జిల్లా అధికార వర్గాలు తీవ్రంగా పరిగణించాయి. డిప్యూటీ కలెక్టర్ వెంటనే హాస్టల్ ను సందర్శించి ఘటనపై ఆరా తీశారు. మృతశిశువును బాలిక తల్లిదండ్రులకు అప్పగించి, బాలికను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించి, హాస్టల్ సూపరింటిండెంట్ ను సస్పెండ్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతామని వెల్లడించారు.

Chattisgarh
Dantewada
Hostel
Student
Pregnent
Delivery
  • Loading...

More Telugu News