Telangana: బండి సంజయ్ లెటర్ హెడ్ అంటేనే కేంద్రమంత్రులు హడలిపోతున్నారు: గంగుల కమలాకర్

  • ఎంపీ బండి సంజయ్ పై మంత్రి గంగుల ఆగ్రహం
  • ఎంపీ లేఖల్లో అన్నీ తప్పుడు ఫిర్యాదులేనని విమర్శలు
  • అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు

తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఎంపీ బండి సంజయ్ పై తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. ఇష్టంవచ్చినట్టు వ్యాఖ్యలు చేయడం మాని అభివృద్ధి పనుల కార్యాచరణపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.

బండి సంజయ్ లెటర్ హెడ్ అంటేనే కేంద్ర మంత్రులు భయపడిపోతున్నారని, అతడి లేఖల్లో అన్నీ తప్పుడు ఫిర్యాదులేనని విమర్శించారు. గత ఎనిమిది నెలల కాలంలో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంపీ సంజయ్ ఏంచేశారో చెప్పాలని, కేంద్రం నుంచి ఎన్ని నిధులు తీసుకువచ్చారో వెల్లడించాలని డిమాండ్ చేశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News