ISIS: ఈ ఐసిస్ ఉగ్రవాది బరువు 250 కిలోలు... అరెస్ట్ చేశారు కానీ తరలించడానికి తంటాలు పడ్డారు!

  • ఇరాక్ లో భారీ ఉగ్రవాది అరెస్ట్
  • కారులో ఎక్కించలేక విఫలయత్నాలు
  • తరలించడానికి పికప్ ట్రక్ తీసుకువచ్చిన పోలీసులు

అధినాయకత్వం హతమైనా ఐసిస్ ఉగ్రవాద సంస్థ ఆనవాళ్లు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఇరాక్ లో ఓ ఐసిస్ ఉగ్రవాదిని పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ అతడ్ని తరలించడానికి పోలీసులకు తల ప్రాణం తోకకు వచ్చినంత పనైంది. అతడి పేరు ముఫ్తీ అబు అబ్దుల్ బారీ. బారీ పేరుకు తగ్గట్టు నిజంగా భారీకాయుడే.

అలాంటి ఇలాంటి బాడీ కాదు... 250 కిలోల భారీకాయుడు మరి. చురుగ్గా కదల్లేడు కానీ, పదునైన మాటలతో ఎలాంటి వారినైనా రెచ్చగొట్టి ఉగ్రవాదం దిశగా నడిపించగల వాక్పటిమ ఉన్నవాడు. విద్వేష ప్రసంగాలు చేయడంతో మాస్టర్! ఈ కారణంగానే ఐసిస్ లో అతడికి సముచిత స్థానం కల్పించారు. అతడు మోసుల్ లో ఉన్నాడన్న పక్కా సమాచారంతో పోలీసులు వచ్చారు. అతడ్ని చూసిన తర్వాత ఎక్కడికీ పారిపోలేడని పోలీసులకు అర్థమైంది. కారణం అతడి ఊబకాయమే.

అరెస్ట్ అయితే చేశారు కానీ, అతడ్ని తమ కారులో ఎక్కించడం ఎలాగో పోలీసులకు తెలియలేదు. అన్నిరకాల ప్రయత్నాలు చేసిన తర్వాత కారులో ఎక్కించే ఆలోచన విరమించుకుని, ఓ పికప్ ట్రక్ తెప్పించారు. ఓ పెద్ద బస్తాను ఎత్తి కుదేసినట్టు ఆ ట్రక్కులో పడేసి తీసుకెళ్లారు.

ISIS
Mosul
Iraq
Mufti Abu Abdul Bari
Jabba
Police
  • Loading...

More Telugu News