Srikanth Reddy: చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి: శ్రీకాంత్ రెడ్డి

  • చంద్రబాబు విద్వేషాలను రెచ్చగొడుతున్నారు
  • అమరావతి అభివృద్ధికి చంద్రబాబు చేసిందేమీ లేదు
  • రాయలసీమలో హైకోర్టు పెడితే అభ్యంతరం ఎందుకు?

రాజధాని పేరుతో కుల, మత, ప్రాంతాల మధ్య టీడీపీ అధినేత చంద్రబాబు విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. అమరావతిలో చంద్రబాబు రియలెస్టేట్ బినామీల అవకతవకలు బయట పడుతున్నాయని... వాటిని కప్పిపుచ్చడానికే పోరాటం పేరుతో డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. ఐదేళ్లలో అమరావతి ప్రాంతంలో చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏమీ లేదని... భూములు ఇచ్చిన రైతులకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇన్సైడర్ ట్రేడింగ్ పై సీబీఐ విచారణకు అప్పగిస్తారని చంద్రబాబు భయపడుతున్నారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఆ భయంతోనే రైతులను రెచ్చగొడుతున్నారని చెప్పారు. రాయలసీమలో హైకోర్టు పెడుతుంటే చంద్రబాబుకు అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. శ్రీశైలం ప్రాజెక్టు కోసం ఆ ప్రాంత రైతులు 80 వేల ఎకరాలను త్యాగం చేశారని... ఆ విషయం చంద్రబాబుకు గుర్తు లేదా? అని అడిగారు.

Srikanth Reddy
YSRCP
Chandrababu
Telugudesam
Amaravati
  • Loading...

More Telugu News