Amit Shah: సీఏఏపై అమిత్ షా సరికొత్త వాదన!

  • సీఏఏను వ్యతిరేకించేవారంతా దళిత వ్యతిరేకులే
  • 70 శాతం మంది శరణార్థులు దళితులే
  • సీఏఏపై ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గం

పౌరసత్వ చట్టాన్ని అమలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. మరోవైపు ఈ చట్టాన్ని అనుమతించబోమంటూ బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న  పలు రాష్ట్రాలు ప్రకటించాయి. కొన్ని రాష్ట్రాలు సీఏఏను వ్యతిరేకిస్తూ ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేశాయి. ఈ నేపథ్యంలో, సీఏఏపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సరికొత్త వాదనను తెరపైకి తెచ్చారు. ఈ చట్టాన్ని వ్యతిరేకించేవారంతా దళిత, పేదల వ్యతిరేకులని చెప్పారు. సీఏఏపై ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం  చేశారు.

మన దేశంలో ఉన్న 70 శాతం మంది శరణార్థులు దళితులేనని అమిత్ షా చెప్పారు. వీరికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడం ద్వారా మీరు ఏం సాధించాలనుకుంటున్నారని ప్రశ్నించారు. ఈ చట్టాన్ని ముస్లిం వ్యతిరేక చట్టమని నిరూపించాలని సవాల్ విసిరారు.

Amit Shah
BJP
CAA
  • Loading...

More Telugu News