Thokaleni Pitta: నేనో సినిమాలో నటించిన సంగతిని గుర్తు చేసినందుకు నాగబాబుకు ధన్యవాదాలు: అంబటి

  • గతంలో తోకలేని పిట్ట చిత్రంలో నటించిన అంబటి
  • సెటైర్ వేసిన నాగబాబు
  • కౌంటర్ ఇచ్చిన అంబటి

జనసేన పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి వైసీపీ నేతలకు జనసేన నాయకులకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. జనసేనపైనా, పవన్ పైనా అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేయగా, మెగాబ్రదర్ నాగబాబు వ్యంగ్యంగా స్పందించారు. గతంలో అంబటి రాంబాబు తెలుగులో 'తోకలేని పిట్ట' అనే చిత్రంలో నటించిన విషయాన్ని ఉదహరిస్తూ ట్విట్టర్ లో వ్యంగ్యం ప్రదర్శించారు. దీనికి అంబటి బదులిచ్చారు.

"తోకలేని పిట్ట అనే సినిమాలో నటించిన విషయాన్ని నేను ఎప్పుడో మర్చిపోయాను. మళ్లీ ఇప్పుడు నాగబాబు గారు గుర్తుచేశారు. ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే, అప్పుడు నేను నటనలో ఫెయిలవడంతో సినీ రంగం నుంచి నిష్క్రమించాను. మరిప్పుడు మీరు రాజకీయాల్లో ఓటమిపాలయ్యారు నాగబాబు గారూ, నిష్క్రమిస్తారా, లేక..." అంటూ తనదైన శైలిలో స్పందించారు.

Thokaleni Pitta
Tollywood
Nagababu
Janasena
Pawan Kalyan
Ambati Rambabu
YSRCP
BJP
  • Error fetching data: Network response was not ok

More Telugu News