NIMS: లండన్ సదస్సులో ప్రసంగిస్తూ కుప్పకూలిన నిమ్స్ వైద్యురాలు.. మృతి

  • గుండెపోటుతో మరణించిన డాక్టర్ మీనాకుమారి
  • మీనాకుమారి స్వస్థలం తమిళనాడు
  • పాతికేళ్లుగా నిమ్స్ లో సేవలందిస్తున్న డాక్టర్ 

హైదరాబాదు నిమ్స్ ఆసుపత్రికి చెందిన ఓ సీనియర్ వైద్యురాలు లండన్ లో ఓ సదస్సులో ప్రసంగిస్తూ కుప్పకూలారు. ఆసుపత్రికి తీసుకెళ్లినా ఆమె ప్రాణాలు దక్కలేదు. ప్రఖ్యాత నిమ్స్ ఆరోగ్య సంస్థలో న్యూరాలజీ విభాగం సీనియర్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ మీనా కుమారి అంతర్జాతీయ వైద్య సదస్సులో పాల్గొనేందుకు లండన్ వెళ్లారు. న్యూరాలజీ అంశంపై నిర్వహించిన ఈ సదస్సులో ప్రసంగిస్తుండగా గుండెపోటు రావడంతో వేదికపైనే కుప్పకూలారు.

కార్యక్రమ నిర్వాహకులు వెంటనే స్పందించి మీనాకుమారిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. మీనాకుమారి తమిళనాడుకు చెందినవారు. నిమ్స్ లో గత పాతికేళ్లుగా సేవలందిస్తున్నారు. డాక్టర్ మీనా కుమారి హఠాన్మరణంతో నిమ్స్ వర్గాలు తీవ్ర విషాదంలో కూరుకుపోయాయి. ఆమె కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

NIMS
Hyderabad
Telangana
London
Meena Kumari
Tamilnadu
  • Loading...

More Telugu News