Nagababu: సైన్స్, మ్యాథ్స్, కంప్యూటర్లు డెవలప్ అయ్యాయంటే సున్నా మహత్యమేరా సన్నాసుల్లారా: విజయసాయికి నాగబాబు కౌంటర్

  • గుండు సున్నా అంటూ విజయసాయి ట్వీట్
  • దీటుగా బదులిచ్చిన నాగబాబు
  • జీరో విలువ తెలియని సన్నాసులు అంటూ మండిపాటు

గుండు సున్నా దేనితో కలిపినా, తీసివేసినా దాని విలువలో ఎలాంటి మార్పు ఉండదని విజయసాయిరెడ్డి జనసేన, బీజేపీ కలయికపై సెటైర్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై మెగాబ్రదర్ నాగబాబు కౌంటర్ ఇచ్చారు. జీరో విలువ తెలియని వెధవలకి ఏం చెప్పినా చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్టే ఉంటుందని ఎద్దేవా చేశారు. ఇవాళ సైన్స్, మ్యాథ్స్, కంప్యూటర్ రంగం ఇంత అభివృద్ధి చెందిందంటే అది సున్నా మహత్యమేరా చదువుకున్న జ్ఞానం లేని సన్నాసుల్లారా అంటూ విమర్శించారు.

'మంది సొమ్ము మెక్కిన వెధవ కూడా నీతులు మాట్లాడుతున్నాడు, ఖర్మరా దేవుడా' అంటూ నాగబాబు ట్వీట్ చేశారు. 'అదిరింది' కార్యక్రమం ద్వారా జబర్దస్త్ లోటు తీరిందని, అంబటి, పేర్ని, అవంతి తదితర నేతల కారణంగా ఎక్స్ ట్రా జబర్దస్త్ లోటు కూడా తీరిపోయిందని, అదిరింది కార్యక్రమానికి కామెడీ షో పార్ట్-2 అవసరం లేదేమోనని అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. 

Nagababu
Janasena
YSRCP
Pawan Kalyan
Ambati
Perni
Avanthi
  • Loading...

More Telugu News