Andhra Pradesh: మీడియా వార్తల ఆధారంగా రాజధాని రైతులకు నోటీసులు

  • అమరావతి తరలింపుపై భగ్గుమంటున్న రైతులు
  • దీక్షలు చేపట్టిన రైతులు.. రాజకీయనేతల మద్దతు
  • ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారంటూ పోలీసుల నుంచి నోటీసులు

ఏపీ రాజధాని తరలింపు నిర్ణయంపై గత కొన్నివారాలుగా అమరావతి పరిధిలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. రైతులు అమరావతిని కాపాడుకునేందుకు దీక్షలు చేపడుతున్నారు. ఈ క్రమంలో అనేక ధర్నాలు, రాస్తారోకోలు వంటి కార్యక్రమాలు జరిగాయి. అయితే, వాటిపై మీడియాలో వచ్చిన వార్తలు, ప్రకటనల ఆధారంగా పోలీసులు రైతులకు నోటీసులు జారీ చేశారు.

జైల్ భరో, గుంటూరు కలెక్టరేట్ ముట్టడి వార్తలను ఆధారంగా చేసుకుని వాటిలో పాల్గొన్న వారికి సీఆర్పీసీ సెక్షన్ 149 కింద నోటీసులు పంపుతున్నారు. రైతులకే కాదు, ఆయా ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్న రాజకీయనేతలకు సైతం నోటీసులు అందాయి. అమరావతి ప్రాంతంలోని టీడీపీ నేతలకు, సీపీఐ సీనియర్ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావుకు నోటీసులు జారీ అయినట్టు తెలుస్తోంది.

Andhra Pradesh
Amaravati
Farmers
Notice
Police
Telugudesam
CPI
  • Loading...

More Telugu News