Andhra Pradesh: గుంటూరు జిల్లాలో కరెంట్ షాక్ తగిలి ముగ్గురి మృతి

  • పెట్రోల్ బంక్ లో విద్యుత్ బల్బు మారుస్తుండగా ప్రమాదం
  • ఐరన్ స్టాండ్ 11కేవీ లైన్ కు తగలడంతో విద్యదాఘాతం
  • మృతులు బొప్పూడి, పోలిరెడ్డిపాలెం వాసులుగా గుర్తింపు

ఆంధ్రప్రదేశ్ లోని ఓ పెట్రోల్ బంక్ లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం రామచంద్రపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారి పక్కనే ఉన్న పెట్రోల్ బంకులో ఓ ఇనుప స్టాండ్ సాయంతో విద్యుత్ బల్బు మారుస్తున్న సమయంలో స్టాండ్ 11 కేవీ లైన్ కు తగలడంతో ముగ్గురు వ్యక్తులు విద్యుదాఘాతానికి గురై మరణించారు. మృతులను బొప్పూడి, పోలిరెడ్డిపాలెం గ్రామస్థులుగా గుర్తించారు. డేరంగుల శ్రీనివాసరావు(45) షేక్ మౌలాలి(22) ఘటనా స్థలంలోనే మృతి చెందగా, శేఖర్ (48) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

Andhra Pradesh
Guntur District
petrol bunk
Current Shock
3persons died
  • Loading...

More Telugu News