Smriti Irani: తాను పెయింట్ వేస్తున్న బొమ్మను పోస్టు చేసిన స్మృతి ఇరానీ

  • సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే స్మృతి
  • తనలోని మరో కళను బయటపెట్టిన కేంద్రమంత్రి
  • అప్పుడప్పుడూ బొమ్మలు కూడా వేస్తుంటానన్న బీజేపీ నాయకురాలు

సామాజిక మాధ్యమాల్లో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఎంత చురుకుగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. తనకు సంబంధించిన ఫొటోలతో పాటు తన కుటుంబానికి సంబంధించిన ఫొటోలను కూడా ఆమె పోస్ట్ చేస్తుంటారు. ఒక్కోసారి ఆమె చేసే పోస్టులు వైరల్ అవుతుంటాయి. తాజాగా తనలోని మరో కళను బయటపెట్టారు ఆమె.

తాను అప్పుడప్పుడూ బొమ్మలు కూడా వేస్తుంటానని చెబుతూ పెయింట్ వేస్తున్న ఓ బొమ్మను పోస్టు చేశారు. బొమ్మలు వేయడంలో చాలా అనుభవం ఉన్న వ్యక్తిలా ఆమె ఇందులో కనపడుతున్నారు. ఆమె ఏ బొమ్మ వేస్తున్నారన్న విషయం స్పష్టంగా కనపడట్లేదు. ఆ బొమ్మ వేయడం పూర్తయ్యాక మరోసారి దాని ఫొటోను పోస్ట్ చేస్తారేమో చూడాలి. ఆమెలోని ఈ కళను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Smriti Irani
BJP
Instagram
  • Loading...

More Telugu News