Balakrishna: నాన్నా! మరణం లేని జన్మ మీది: ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా బాలకృష్ణ నివాళులు

  • మీ ఆశయ సాధనే నా జీవిత గమ్యం
  • ప్రతిజన్మలోను మీ బిడ్డగా జన్మించాలని కోరుకుంటున్నా
  • మీ కడుపున జన్మించడం నేను చేసుకున్న గొప్ప పుణ్యం  

టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ 24వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు నటుడు బాలకృష్ణ నివాళులర్పిస్తూ.. ఫేస్ బుక్ లో సందేశాన్ని పోస్ట్ చేశారు. మరణం లేని జన్మ మీదంటూ.. ప్రతి జన్మలోను మీ బిడ్డగా జన్మించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.  

‘మీ కడుపున జన్మించడం నేను చేసుకున్న గొప్ప పుణ్యం. మీ ఆశయ సాధనే నా జీవిత గమ్యం ..మీరు కన్న కలలు నిజం చేస్తాను...మరణం లేని జననం మీది...జోహార్ ఎన్టీఆర్....మీరే నాకు దైవం, స్పూర్తి, గురువు. ప్రతిజన్మలోను మీ బిడ్డగా జన్మించాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ..’ మీ నందమూరి బాలకృష్ణ.. అంటూ సందేశాన్ని పోస్ట్ చేశారు.

Balakrishna
NTR
Death anniversary
Telugudesam
  • Loading...

More Telugu News