Nara Bhuvaneswari: మహిళలు చేస్తున్న ఉద్యమం చాలా గొప్పది: నారా భువనేశ్వరి

  • మహిళల ఉద్యమానికి నా మద్దతు
  • మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే
  • బసవతారకం ఆసుపత్రి, ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తాయి

టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ 24వ వర్ధంతి నేపథ్యంలో ఆయనకు టీడీపీ అధినేత చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం రైతులు చేస్తోన్న పోరాటంపై ఆమె స్పందించారు.

అమరావతి కోసం మహిళలు చేస్తున్న ఉద్యమం చాలా గొప్పదని చెప్పారు. వారి ఉద్యమానికి తన మద్దతు ఉంటుందని తెలిపారు. మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధ్యమేనని అన్నారు. బసవతారకం ఆసుపత్రితో పాటు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ హైదరాబాద్ కేంద్రంగానే పనిచేస్తాయని చెప్పారు భువనేశ్వరి. కాగా, ఇటీవల ఆమె రాజధాని పరిరక్షణ సమితికి తన గాజులను విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే.

Nara Bhuvaneswari
Chandrababu
Telugudesam
  • Loading...

More Telugu News