sleep: కంటినిండా నిద్రపోతేనే ఆరోగ్యంగా ఉంటారు.. బ్రిటన్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి
- 9 గంటలు నిద్రించే వారు ఆరోగ్యంగా ఉంటున్నారు
- వారి శరీర కణజాలాల్లో కొలాజెన్ ప్రొటీన్లు అత్యంత క్రియాశీలంగా ఉన్నాయి
- వెల్లడించిన మాంఛెస్టర్ వర్సిటీ పరిశోధకులు
రాత్రి సరిగ్గా నిద్రపోకపోతే ఆ మరుసటి రోజు సరిగ్గా పని చేయలేం. కంటి నిండా నిద్రపోతే ఉత్సాహంగా పనులు చేసుకుంటాం. ఇందుకు గల కారణాలను గుర్తించిన పరిశోధకులు కంటినిండా నిద్రపోతే శారీరక ఆరోగ్యం బాగుంటుందని చెప్పారు.
రోజూ రాత్రి 8 గంటలకు నిద్రపోయి, ఉదయం 5 గంటల్లోపు నిద్రలేచే (9 గంటలు నిద్ర) వారి శరీర కణజాలాల్లో కొలాజెన్ అనే ప్రొటీన్లు అత్యంత క్రియాశీలంగా ఉంటున్నట్లు బ్రిటన్‌లోని మాంఛెస్టర్ వర్సిటీ పరిశోధకులు తమ అధ్యయనంలో గుర్తించారు. జీవగడియారం ప్రకారం నిద్రిస్తే కండరాలు, ఎముకలు, చర్మంలోని కణ జాలాల్లో నిర్మాణాత్మక, రసాయనిక చర్యలు గతి తప్పకుండా జరుగుతాయని, దీంతో ఆరోగ్యకరంగా ఉంటారని చెప్పారు.