Nirbhaya: అలాంటి సలహా ఎలా ఇస్తారు?: ఇందిరా జైసింగ్ సూచనపై నిర్భయ తల్లి తీవ్ర వ్యాఖ్యలు

  • దోషులను క్షమించాలన్న ఇందిర వ్యాఖ్యలపై ఫైర్
  • క్షమించమనేంత ధైర్యం ఎలా వచ్చిందని ప్రశ్న
  • ఇలాంటి వారివల్లే బాధితులకు న్యాయం జరగడం లేదని ఆగ్రహం

నిర్భయ దోషులను క్షమించాలంటూ సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ చేసిన అభ్యర్థనపై నిర్భయ తల్లి తీవ్రంగా స్పందించారు. ఇలాంటి వారి వల్లే అత్యాచార బాధితులకు న్యాయం జరగడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉరిశిక్షకు తాను వ్యతిరేకమని, నిర్భయ దోషులను ఆమె తల్లి ఆశాదేవి క్షమించాలని ఆమె కోరారు. ఈ విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేత సోనియాగాంధీని ఆదర్శంగా తీసుకోవాలని ట్విట్టర్ వేదికగా సూచించారు.

ఇందిర విజ్ఞప్తిపై స్పందించిన ఆశాదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె అలాంటి సలహా ఎలా ఇవ్వగలరని మండిపడ్డారు. అసలు తనకు సలహా ఇవ్వడానికి ఆమె ఎవరని ప్రశ్నించారు. ఉరి తీయాలని దేశమంతా కోరుకుంటుంటే, క్షమించమనేంత ధైర్యం ఆమె ఎలా చేయగలిగారని మండిపడ్డారు. గతంలో ఇందిరను చాలాసార్లు కలిసినా తన క్షేమ సమాచారాల గురించి ఎప్పుడూ అడగలేదని, ఇప్పుడు మాత్రం దోషుల తరపున వకాల్తా పుచ్చుకుని క్షమించమని కోరుతున్నారని ఆశాదేవి ఫైరయ్యారు.

Nirbhaya
Ashadevi
Indira jaisingh
  • Loading...

More Telugu News