Woman: అక్రమ సంబంధం నేపథ్యంలో గొడవలు.. యువకుడిని కొట్టి చంపిన మహిళ కుటుంబ సభ్యులు

  • హైదరాబాద్, బోరబండలో ఘటన
  • ఇంటికొచ్చి బాధితుడిపై దాడిచేసిన మహిళ కుటుంబ సభ్యులు
  • దెబ్బలకు తాళలేక మృతి

అక్రమ సంబంధం వ్యవహారం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. హైదరాబాద్‌లోని సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. బోరబండలోని అల్లాపూర్‌కు చెందిన అజయ్ (30) మాదాపూర్‌లోని ఓ కళాశాలలో అకౌంటెంట్‌గా పనిచేస్తూనే ఎస్సార్‌నగర్‌లో హాస్టల్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో మూసాపేటకు చెందిన ఓ మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు.

మరోపక్క, ఆ మహిళ కుమార్తెను కూడా ఇతను వేధిస్తుండడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తోంది. దీంతో మహిళ బంధువులు నిన్న మధ్యాహ్నం బోరబండలోని అజయ్ ఇంటికి వచ్చి గొడవ పడ్డారు. అది మరింత పెరగడంతో అజయ్‌పై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. అనంతరం అతడిని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. తీవ్రగాయాలపాలైన అజయ్‌ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Woman
Borabanda
attack
Crime News
  • Loading...

More Telugu News