Actor Suman: తిరుమల శ్రీవారి సేవలో చిరంజీవి భార్య సురేఖ, సుమన్

  • ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామి వారి సేవ
  • సుమన్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 40 ఏళ్లు 
  • తీర్థ ప్రసాదాలు అందజేసిన పండితులు

తిరుమల శ్రీవారిని నేడు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రముఖ సినీ నటుడు చిరంజీవి భార్య సురేఖ ఈ ఉదయం తిరుమల చేరుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆమె స్వామి సేవలో పాల్గొన్నారు. అదే సమయంలో మరో నటుడు సుమన్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామి వారి దర్శనానంతరం నటుడు సుమన్ మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలోకి తాను అడుగుపెట్టి నాలుగు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా స్వామి వారిని దర్శించుకున్నట్టు తెలిపారు.

Actor Suman
Chiranjeevi
Surekha
Tirumala
  • Loading...

More Telugu News