Boyapati Sreenu: దర్శకుడు బోయపాటి శ్రీను కుటుంబంలో విషాదం.... అనారోగ్యంతో తల్లి మృతి

  • పెదకాకానిలో తుదిశ్వాస విడిచిన బోయపాటి తల్లి సీతారావమ్మ
  • సీతారావమ్మ వయసు 80 ఏళ్లు
  • కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బోయపాటి మాతృమూర్తి

టాలీవుడ్ దర్శకుడు బోయపాటి శ్రీను కుటుంబంలో విషాదం నెలకొంది. బోయపాటి శ్రీను మాతృమూర్తి సీతారావమ్మ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె వయసు 80 సంవత్సరాలు. సీతారావమ్మ తమ స్వస్థలం గుంటూరు జిల్లా పెదకాకానిలో కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో సినిమా చిత్రీకరణలో ఉన్న బోయపాటి తల్లి మరణవార్తతో వెంటనే స్వగ్రామం బయల్దేరారు.

Boyapati Sreenu
Seetharavamma
Guntur District
Pedakakani
Tollywood
  • Loading...

More Telugu News