BJP: ఢిల్లీ రావాలంటూ అన్ని రాష్ట్రాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కోర్ గ్రూప్ సభ్యులకు బీజేపీ హైకమాండ్ ఆదేశం

  • ఈ నెల 20న ఢిల్లీ రావాలని సందేశం
  • జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు అందుబాటులో ఉండాలని సూచన
  • నామినేషన్ దాఖలు చేయనున్న జేపీ నడ్డా

ఈ నెల 20న ఢిల్లీ రావాలంటూ దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులకు బీజేపీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కోర్ గ్రూప్ సభ్యులకు ఈ మేరకు బీజేపీ అధినాయకత్వం నుంచి సందేశాలు వెళ్లాయి. పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ఉన్నందున అందరూ అందుబాటులో ఉండాలని ఆ సందేశాల్లో పేర్కొన్నారు. కాగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఎన్నిక లాంఛనమే. అధ్యక్ష పదవి కోసం నడ్డా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రస్తుతం ఆయన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

BJP
JP Nadda
Party
President
Narendra Modi
Amit Shah
  • Loading...

More Telugu News