Australia: రాజ్ కోట్ వన్డేలో లక్ష్యం దిశగా పోరాడుతున్న ఆస్ట్రేలియా

  • ఆసీస్ లక్ష్యం 341 పరుగులు
  • 28 ఓవర్లలో 2 వికెట్లకు 163 రన్స్ చేసిన ఆసీస్
  • క్రీజులో స్మిత్, లబుషేన్

రాజ్ కోట్ లో జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా జట్టు భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు పోరాడుతోంది. టీమిండియా విసిరిన 341 పరుగుల లక్ష్యఛేదనలో ఆసీస్ 28 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఆ జట్టు గెలవాలంటే ఇంకా 30 ఓవర్లలో 178 పరుగులు చేయాలి.

ప్రస్తుతం క్రీజులో స్టీవ్ స్మిత్ (64 బ్యాటింగ్), లబుషేన్ (42 బ్యాటింగ్) ఆడుతున్నారు. అంతకుముందు ఓపెనర్ డేవిడ్ వార్నర్ 15 పరుగులు చేసి షమీ బౌలింగ్ లో మనీష్ పాండే పట్టిన కళ్లు చెదిరే క్యాచ్ కు అవుటయ్యాడు. కెప్టెన్ ఆరోన్ ఫించ్ (33) లెఫ్టార్మ్ స్పిన్నర్ జడేజా బౌలింగ్ లో స్టంపౌటయ్యాడు. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 340 పరుగుల భారీ స్కోరు సాధించింది.

Australia
India
Rajkot
ODI
Cricket
  • Loading...

More Telugu News