India: వచ్చే ఐదేళ్లలో భారత్ లో పది లక్షల ఉద్యోగాలు... అమెజాన్ అధినేత ప్రకటన
- భారత్ పర్యటనకు వచ్చిన జెఫ్ బెజోస్
- రూ.7 వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్టు ప్రకటన
- అసంతృప్తి వ్యక్తం చేసిన కేంద్రం
ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థ అధినేత జెఫ్ బెజోస్ భారత్ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భారత్ లో రూ.7 వేల కోట్లు పెట్టుబడి పెడతామని బెజోస్ చెప్పారు. కానీ దీనిపై కేంద్రం వ్యతిరేకదిశలో స్పందించింది. అమెజాన్ సొంత లాభం కోసం పనిచేస్తుందని, వేల కోట్లు పెట్టుబడులు పెట్టినంత మాత్రాన భారత్ కు మేలు చేస్తున్నట్టు కాదని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి వ్యాఖ్యలపై వెంటనే స్పందించిన అమెజాన్ యాజమాన్యం వచ్చే ఐదేళ్లలో భారత్ లో 10 లక్షల ఉద్యోగాలు కల్పించనున్నట్టు ప్రకటన చేసింది. తమ భారీ ప్రణాళికల ద్వారా భారత యువత ప్రత్యక్షంగా, పరోక్షంగా లబ్ది పొందుతారని బెజోస్ తెలిపారు.