Botsa Satyanarayana Satyanarayana: రాజకీయాల్లో క్లారిటీ అన్నది లేని వ్యక్తి పవన్: మంత్రి బొత్స

  • రాజకీయ ఉనికి కోసమే జనసేన, బీజేపీల పొత్తు
  • 2024లో అధికారంలోకి వస్తామని చెప్పడం విడ్డూరం
  • పవన్, కన్నా లక్ష్మీనారాయణలు ఏమైనా జ్యోతిష్యులా?  

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి బొత్స నారాయణ విమర్శలతో విరుచుకుపడ్డారు. రాజకీయాల్లో క్లారిటీ అన్నది లేని వ్యక్తి పవన్ అని విమర్శించారు. రాజకీయ ఉనికి కోసమే బీజేపీ, జనసేన పొత్తు కుదుర్చుకున్నాయని ధ్వజమెత్తారు. మంత్రి ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ.. 2024లో అధికారంలోకి వస్తామని చెప్పడానికి పవన్ కల్యాణ్, కన్నా లక్ష్మీనారాయణలు ఏమైనా జ్యోతిష్యులా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీలు కలవడం, విడిపోవడం సహజమే అని ఆయన వ్యాఖ్యానించారు.

   

Botsa Satyanarayana Satyanarayana
YSRCP
Janasena
Pawan Kalyan
BJP
Kanna Lakshminarayana
  • Loading...

More Telugu News