Andhra Pradesh: పవన్ కల్యాణ్ కు పర్మినెంట్ నిర్మాత, దర్శకుడు చంద్రబాబే: వెల్లంపల్లి వ్యాఖ్యలు

  • బీజేపీతో జట్టుకట్టిన జనసేన
  • విమర్శలు గుప్పిస్తున్న ఏపీ మంత్రులు
  • పవన్ కు నిలకడ లేదన్న వెల్లంపల్లి

బీజేపీతో జనసేన చేయి కలపడం పట్ల ఏపీ మంత్రులు స్పందిస్తున్నారు. తాజాగా ఏపె దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, పవన్ కు సిద్ధాంతాలు, సొంత భావజాలం ఉండవని, టీడీపీ అధినేత చంద్రబాబు దర్శకత్వంలోనే బీజేపీ ముసుగు ధరించారని ఆరోపించారు. పవన్ కు పర్మినెంట్ నిర్మాత, దర్శకుడు చంద్రబాబేనని వ్యంగ్యంగా అన్నారు.

డబ్బులు తీసుకుంటూ రాజకీయాలు చేసే నేత పవన్ ఒక్కరేనని, అన్నం పెట్టిన అన్నను సైతం వదిలేశారని విమర్శించారు. చిరంజీవి ఎంతో విజ్ఞతతో ఆలోచిస్తే, పవన్ అందుకు భిన్నంగా ఎవరు డబ్బులిస్తే వారికి వంతపాడతారని వ్యాఖ్యానించారు. పవన్ కు స్థిరత్వం లేదని, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడి, ఇప్పుడు మరో మాట మాట్లాడుతున్నారని ఆరోపించారు.

Andhra Pradesh
Pawan Kalyan
Janasena
Chandrababu
Telugudesam
YSRCP
Vellampalli Srinivasa Rao
  • Loading...

More Telugu News