Botsa Satyanarayana: కావాలంటే మీరు కూడా వాళ్లకు మెయిల్ పెట్టుకోండి: మద్రాస్ ఐఐటీ నివేదికపై ప్రశ్నకు బొత్స

  • మేము చెప్పేవన్నీ అబద్ధాలే అంటారా?
  • ఓ పత్రికలో వచ్చే కథనాలపై నేను ఏం మాట్లాడాలి? 
  • అసెంబ్లీని చంద్రబాబే తాత్కాలిక భవనం అన్నారు  

రాజధానిగా అమరావతి ప్రాంతం ఏమాత్రం అనుకూలం కాదని ఐఐటీ మద్రాస్ తన నివేదికలో తెలిపిందంటూ ఏపీ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాము అలాంటి నివేదికను ఇవ్వలేదంటూ ఐఐటీ మద్రాస్ జవాబిచ్చిందని ఈ రోజు ఒక పత్రికలో వార్త వచ్చింది. ఈ రోజు మంత్రి బొత్స సత్యనారాయణకు మీడియా నుంచి ఇదే ప్రశ్న ఎదురుకాగా... ఆయన నేరుగా సమాధానం చెప్పలేదు.

'మేము చెప్పేవన్నీ అబద్ధాలే అంటారా?' అని ప్రశ్నించిన బొత్స... 'కావాలంటే మీరు ఐఐటీ మద్రాస్ కు మెయిల్ పెట్టుకోండి' అని వ్యాఖ్యానించారు. శివరామకృష్ణన్ కమిటీ కూడా అబద్ధమేనా? అని ప్రశ్నించారు. ఓ పత్రికలో వచ్చే కథనాలపై తాను ఏం మాట్లాడగలనని అడిగారు. అసెంబ్లీని చంద్రబాబే తాత్కాలిక భవనం అని చెప్పారని... అలాంటప్పుడు దాన్ని తాము శాశ్వత భవనమని ఎలా అనగలమని ప్రశ్నించారు. చంద్రబాబుకు కేవలం ఆయన సామాజికవర్గంపైనే అంకితభావం ఉందని విమర్శించారు.

Botsa Satyanarayana
IIT Madras
Amaravati
YSRCP
Telugudesam
Chandrababu
  • Loading...

More Telugu News