Pawan Kalyan: చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు ఇది అలవాటే: ఏపీ మంత్రి బాలినేని

  • కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని బీజేపీని పవన్ విమర్శించారు
  • ఇప్పుడు అదే బీజేపీతో చేతులు కలిపారు
  • మాకు ఎవరితోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ లపై ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల సమయంలో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని బీజేపీని పవన్ కల్యాణ్ విమర్శించారని... ఇప్పుడు అదే బీజేపీతో చేతులు కలిపారని ఆయన విమర్శించారు.

ఇలాంటి వ్యవహారాలు చంద్రబాబు, పవన్ లకు షరా మామూలేనని అన్నారు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం వైసీపీకి లేదని ఆయన చెప్పారు. వైసీపీ పుట్టినప్పటి నుంచి ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఇతర పార్టీలు ఎవరితో పొత్తు పెట్టుకున్నా వైసీపీకి వచ్చే నష్టమేమీ లేదని అన్నారు.

Pawan Kalyan
Balineni Srinivasa Reddy
Chandrababu
Telugudesam
YSRCP
Janasena
  • Loading...

More Telugu News