TRS: బీజేపీ ఎన్నికల ప్రచారానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు: లక్ష్మణ్

  • టీఆర్ఎస్ ప్రభుత్వం మాటలకే పరిమితమైంది
  • అన్ని విషయాల్లోనూ ఎంఐఎంను వెనకేసుకొస్తోంది
  • టీఆర్‌ఎస్ బెదిరింపులకు దిగితే సహించబోము

టీఆర్ఎస్ ప్రభుత్వం మాటలకే పరిమితమైందని, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించలేకపోతోందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. రాష్ట్రంలో పలు పథకాలను టీఆర్‌ఎస్‌ సరిగ్గా అమలు చేయలేకపోతోందని ఆయన చెప్పారు. ఈ రోజు ఉదయం భూత్పూర్‌ పురపాలిక ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. టీఆర్ఎస్‌ అన్ని విషయాల్లోనూ ఎంఐఎంను వెనకేసుకొస్తోందని ఆయన ఆరోపించారు.

రైతు రుణమాఫీ, రైతు బంధు పథకాలు అమలు కావట్లేదని లక్ష్మణ్ విమర్శించారు. టీఆర్‌ఎస్ నేతలు బెదిరింపులకు దిగితే, సహించబోమని ఆయన చెప్పారు. బీజేపీ ఎన్నికల ప్రచారానికి టీఆర్‌ఎస్‌ నేతలు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. 

TRS
laxman
Telangana
BJP
  • Loading...

More Telugu News