Ram Gopal Varma: 'ముప్పావలా' సినిమాపై రామ్ గోపాల్ వర్మ వివరణ

  • వర్మ తదుపరి చిత్రం 'ముప్పావలా' అంటూ ఫేక్ న్యూస్
  • ఆ ట్వీట్ చేసింది నేను కాదన్న వర్మ
  • ఎవరో పోస్ట్ చేశారంటూ వ్యాఖ్య

సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' చిత్రం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఎలా ఆడిందన్న సంగతి అటుంచితే... దానికి సంబంధించి జరిగిన రచ్చ మాత్రం అంతాఇంతా కాదు. ఈ నేపథ్యంలో, వర్మ నెక్స్ట్ మూవీ ఏమిటనే దానిపై ఆసక్తి నెలకొంది. మరోసారి మరో వివాదాస్పద అంశాన్నే వర్మ ఎంపిక చేసుకుంటాడనేది చాలా మంది భావన.

ఇది నిజమే అన్నట్టుగా... ఆయన పేరిట ఓ ట్వీట్ వైరల్ అయింది. తన కొత్త సినిమాను ప్రకటిస్తుండటం తనకు చాలా సంతోషంగా ఉందంటూ ఆయన పేరిట ట్వీట్ వచ్చింది. తన తదుపరి చిత్రం 'ముప్పావలా' అంటూ ఓ పోస్టర్ షేర్ చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కథాంశంతో సినిమా వస్తున్నట్టు పోస్టర్ చాలా క్లియర్ గా ఉంది. ఇది సంచలనంగా మారింది.

ఈ క్రమంలో, దీనిపై రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఆ ట్వీట్ తనది కాదని ట్విట్టర్ ద్వారా తెలిపారు. మార్ఫింగ్ చేసిన ఇమేజ్ తో దాన్ని ఎవరో పోస్ట్ చేశారని... దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం తనకు లేదని చెప్పారు. కావాలనుకుంటే ఎవరైనా సరే తన ట్వీట్ హిస్టరీని చెక్ చేసుకోవచ్చని తెలిపారు.

Ram Gopal Varma
RGV
Muppavala Movie
Tollywood
  • Loading...

More Telugu News