Krishna District: కృష్ణా జిల్లాలో ట్రాక్టర్ బోల్తా.. ముగ్గురు కూలీల దుర్మరణం

  • నందిగామ సమీపంలోని జొన్నలగడ్డ వద్ద ఘటన
  • 25 మంది కూలీలతో వెళ్తూ బోల్తా
  • మృతులను గుమ్మడిదల వాసులుగా గుర్తింపు

కృష్ణా జిల్లా నందిగామ సమీపంలో ఈ ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. 25 మంది కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ జొన్నలగడ్డ వద్ద ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. మృతి చెందిన వారిని పెనుగంచిప్రోలు మండలం గుమ్మడిదలకు చెందిన వారిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Krishna District
Road Accident
Nandigama
  • Loading...

More Telugu News