Rajasingh: భువనగిరిలో బైక్ ర్యాలీ నిర్వహించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్!

  • తెలంగాణను అప్పుల కుప్ప చేసిన కేసీఆర్
  • జరిగిన అభివృద్ధి శూన్యం
  • ఎన్నికల్లో గెలుపు కోసం పోలీసుల సాయం
  • బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో బైక్‌ ర్యాలీని రాజాసింగ్ తలపెట్టగా, పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో చేసేదేమీ లేక వెనుదిరిగిన ఆయన, భువనగిరి పట్టణంలో బీజేపీ కార్యకర్తలతో కలిసి బైక్‌ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారని విమర్శించారు.

టీఆర్‌ఎస్ కు ఓటేస్తే అభివృద్ధి శూన్యమని, పోలీసులు కేసీఆర్‌ కు బ్రోకరిజం చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యతను పార్టీ నేతలపై కాకుండా పోలీసులపై పెట్టారని అన్నారు. అందుకే ఇతర పార్టీల నేతలను పోలీసులు బెదిరింపులకు గురి చేస్తున్నారని అన్నారు. ప్రతి ఇంటికీ మంచినీళ్లు ఇవ్వలేకుంటే, ఓట్లు అడగబోనని చెప్పిన కేసీఆర్, ఇప్పుడు ఎందుకు ఓట్లు అడుగుతున్నారని రాజాసింగ్ ప్రశ్నించారు.

Rajasingh
Goshamahal
Yadadri Bhuvanagiri District
Bike Rally
  • Loading...

More Telugu News