Tirumala: తిరుమలలో మహేశ్ బాబు, విజయశాంతి!

  • మొక్కులు తీర్చుకునేందుకు వచ్చిన చిత్ర యూనిట్
  • వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామి దర్శనానికి
  • తీర్థప్రసాదాలు అందించిన అధికారులు  

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు దంపతులతో పాటు సీనియర్ నటి విజయశాంతి తదితర 'సరిలేరు నీకెవ్వరు' టీమ్ ఈ ఉదయం తిరుమల స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపింది. మహేశ్ బాబు, నమ్రత, గౌతమ్, సితారలతో పాటు రాజేంద్రప్రసాద్, వంశీ పైడిపల్లి, దర్శకుడు అనిల్ రావిపూడి, ఎన్వీ ప్రసాద్, దిల్ రాజు తదితరులు, ఈ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఆలయంలోకి వెళ్లారు.

గత వారం విడుదలైన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని, కలెక్షన్ల పరంగా తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వామివారికి మొక్కులు తీర్చుకునేందుకు వచ్చినట్టు చిత్ర యూనిట్ పేర్కొంది. ఆలయానికి వచ్చిన సెలబ్రిటీలకు ప్రొటోకాల్ స్వాగతం పలికిన టీటీడీ అధికారులు, దర్శనం తరువాత వారికి తీర్థ ప్రసాదాలు అందించారు.

Tirumala
TTD
Mahesh Babu
Vijayasanthi
SarileruNeekevvaru
Namrata
Anil Ravipudi
Dil Raju
Vamsi Paidipalli
Tirupati
  • Loading...

More Telugu News