Andhra Pradesh: పవన్ ఢిల్లీ వెళ్లింది అమరావతి కోసం అనుకున్నాం: సీపీఐ నారాయణ

  • రాజధానిలో పర్యటించిన నారాయణ
  • తుళ్లూరులో రైతుల దీక్షకు మద్దతు
  • పవన్ తో సయోధ్య గత ఎన్నికల వరకేనని వెల్లడి
  • రాజధాని అంశం ప్రధాని ప్రతిష్ఠకు సవాలు అని వ్యాఖ్యలు

సీపీఐ అగ్రనేత నారాయణ ఏపీ రాజధాని అమరావతిలో పర్యటించిన సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తుళ్లూరు వెళ్లిన ఆయన రైతుల దీక్షకు మద్దతు పలికారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లింది అమరావతి కోసం అనుకున్నామని తెలిపారు. గతంలో ఎన్నికల వేళ మాత్రమే పవన్ తో కలిశామని, అంతకుమించి జనసేనతో తమకు సయోధ్య లేదని నారాయణ స్పష్టం చేశారు. రాజధాని మార్పు అంశం ప్రధాని మోదీ ప్రతిష్ఠకు సవాలు అని అభిప్రాయపడ్డారు. ప్రధానే పునాది వేశాక ఇప్పుడు అమరావతిని మాయం చేయాలని ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. శంకుస్థాపనపై విశ్వాసం ఉంటే ప్రధాని జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.

Andhra Pradesh
Amaravati
Pawan Kalyan
Janasena
CPI Narayana
AP Capital
Narendra Modi
BJP
  • Loading...

More Telugu News